భోళా శంకర్ సినిమా మోషన్ పోస్టర్

మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు (ఆగష్టు 22). ఇప్పటికే చిరంజీవి పుట్టినరోజు వేడుకలు సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నారు. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా కొత్త సినిమాకు సంబంధించిన అప్డేట్ ను సూపర్ స్టార్ మహేష్ బాబు టైటిల్ మోషన్ పోస్టర్ ను విడుదల చేశారు.

ఈ సినిమా ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై తెరకెక్కుతుండగా ఈ చిత్రాన్ని అనిల్‌ సుంకర నిర్మిస్తున్నారు, దర్శకత్వం మెహర్ రమేష్. ఈ సినిమాకు ”బోళా శంకర్‌” అనే టైటిల్ ను ఖరారు చేశారు. మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ సినిమాలో సరికొత్త లుక్ లో కనిపించనున్నాడు. ఇక ఈ సినిమాలో చిరంజీవికి చెల్లి పాత్రకు కీర్తి సురేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు టాక్.