అల్లు అర్జున్ పుష్ప లిరికల్ సాంగ్
అల వైకుంఠపురుమలో వంటి బ్లాక్ బస్టర్ చిత్రంలో ఎంతో క్లాస్‌గా కనిపించి అలరించిన అల్లు అర్జున్ ఇప్పుడు పుష్ప సినిమాలో పూర్తి మాస్ లుక్‌లో దిగిపోయాడు. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో బన్నీ పుష్పరాజ్ అనే లారీ డ్రైవర్‌గా కనిపించనున్నాడు. ఆయన భార్య పాత్రలో రష్మిక కూడా డీ గ్లామర్‌గానే కనిపించనుందని సమాచారం. కొద్ది సేపటి క్రితం దేవి శ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన లిరికల్ సాంగ్ వీడియోను విడుదల చేశారు.
ఈ పాటను ఐదు భాషలలో ఐదుగురు ఫేమస్ సింగర్స్ పాడారు. హిందీలో ఈ పాటను విశాల్ దద్లానీ, తెలుగులో శివం, కన్నడంలో విజయ్ ప్రకాశ్, మళయాలంలో రాహుల్ నంబియార్, తమిళంలో బెన్నీ దయాల్ ఆలపించారు. ఈ పాటలో బన్నీ మాస్ లుక్, స్టెప్స్ డిఫరెంట్‌గా ఉన్నాయి.